దేశంలో బెదిరింపు కాల్స్ ఎక్కువవుతున్నాయి. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ను చంపుతామని బెదిరింపు కాల్స్ చేశారు గుర్తుతెలియని వ్యక్తులు. శనివారం (నవంబర్ 2) సాయంత్రం సీఎం యోగిని చంపుతామని ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ రూంకు కాల్స్ చేశారు దుండగులు. పదిరోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేయకపోతే ఎన్ సీపీ నేత బాబా సిద్ధిక్ కి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు భద్రతా దళాలను అలెర్ట్ చేశారు. సీఎం యోగి ఆదిత్యానాథ్ కు భద్రత పెంచారు.
ALSO READ : ‘జుమ్లా’ మోదీ.. కాంగ్రెస్‌పై విమర్శలా : కాంగ్రెస్ సీనియర్‌నేత జైరామ్ రమేశ్
అక్టోబర్ 12న తన కార్యాలయంలో దసరా పండుగ జరుపుకుంటున్న సమయంలో బాబా సిద్ధిక్ ను అతని కుమారుడు జీషన్ సిద్దిక్ ను ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపారు. మరోవైపు ఇటీవల పలు విమానాశ్రయాలు, విమానాలు, పలు స్కూళ్లకు బెదిరింపు కాల్స్ చేశారు దుండగులు. దేశవ్యాప్తంగా ఉన్న సీఆర్ పీఎస్ స్కూళ్లకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు కూడా ఇటువంటి బెదిరింపులే వచ్చాయి.