ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుత్తున్నాయి. బుధవారం ( సెప్టెంబర్25)న కురిసిన వర్షాలకు ముంబై నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. పలు రైళ్లను రద్దు చేశారు. ముంబై ఎయిర్ పోర్టు కు వచ్చే పలు విమానాలను దారి మళ్లించారు. వర్షాలు, వరదల్లో చిక్కుకుని నలుగురు మృతి చెందారు. మరో రెండు రోజులు ముంబైలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనివాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. దీంతో బృహణ్ ముంబై కార్పొరేషన్ పరిధిలోని అన్ని స్కూళ్లకు సెలవులు ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం. భారీ వర్షాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇండ్లనుంచి ఎవరూ బయటకు రావొద్దని ముంబై పోలీసులు సూచించారు.
Also Read:-రూ.7కోట్లు వచ్చేవే కానీ.. రూ.కోటి గెలుచుకున్న 22 ఏళ్ల యువకుడు
బుధవారం ముంబై ఎడతెరిపి లేని వర్షాల కారణంగా గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయింది. ముంబై ఎయిర్ పోర్టు వచ్చే 14 విమానాలను దారి మళ్లించారు. భారీ వర్షాల కారణంగా పలు రైళ్లను రద్దు చేశారు.
రాబోయే రెండు రోజులు కూడా భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ, రేపు ( శుక్రవారం సెప్టెంబర్ 26, 27న) పాల్ఘర్, థానే, రాయ్ గఢ్ జిల్లా్లో భారీ వర్షాలున్నట్లు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.