లక్నో: ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న ముంబై.. 27 ఏళ్ల తర్వాత ఇరానీ కప్‌ను సొంతం చేసుకుంది. తనుష్ కొటియాన్ (114 నాటౌట్) సెంచరీతో చెలరేగడంతో.. రెస్టాఫ్ ఇండియాతో శనివారం ముగిసిన ఈ మ్యాచ్ డ్రా అయ్యింది. అయితే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం వల్ల ముంబైకి టైటిల్ లభించింది. 1997–-98 సీజన్‌లో చివరిసారి కప్ నెగ్గిన ముంబై ఆ తర్వాత 8సార్లు ఫైనల్స్ ఆడినా సక్సెస్ కాలేదు. ఓవరాల్‌గా ముంబైకి ఇది15వ ఇరానీ కప్.
153/6 ఓవర్‌నైట్ స్కోరుతో ఐదో రోజు ఆట కొనసాగించిన ముంబై రెండో ఇన్నింగ్స్‌ను 38 ఓవర్లలో 329/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఓవర్‌నైట్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ (17), శార్దూల్ ఠాకూర్ (2) తర్వగా ఔటైనా, మోహిత్ అవాస్తి (51 నాటౌట్) నిలకడగా ఆడాడు. సారాన్ష్ జైన్ 6 వికెట్లు తీశాడు. సర్ఫరాజ్ ఖాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
🏆 Mumbai have won their first Irani Cup title in 27 years! pic.twitter.com/4nonx4u5pv
— Cricbuzz (@cricbuzz) October 5, 2024