ముంబై : మహారాష్ట్రలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ముంబైలో వైరస్ తీవ్రత ఎక్కువైంది. నిన్న ముంబైలో 1377 కోవిడ్ కేసులు రాగా.. బుధవారం ఒక్కరోజే కొత్తగా 2,510 కేసులు నమోదయ్యాయి. మంగళవారంతో పోలిస్తే ఇవాళ పెరిగిన కేసుల సంఖ్య 82శాతం ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తోంది. వైరస్ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులతో సమావేశమైన మంత్రి ఆదిత్య థాక్రే పరిస్థితిని సమీక్షించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
COVID19 | Mumbai reports 2,510 new cases, one death and 251 recoveries today pic.twitter.com/YSSqZ8RGXf
— ANI (@ANI) December 29, 2021
మరిన్ని వార్తల కోసం..