భారీ వర్షాలకు బెంబేలెత్తుతున్న బొంబాయి.. కుప్పకూలిన మూడంతస్థుల బిల్డింగ్

భారీ వర్షాలకు బెంబేలెత్తుతున్న బొంబాయి.. కుప్పకూలిన మూడంతస్థుల బిల్డింగ్

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉత్తరాఖండ్, యూపీ, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. భారీ వర్షాలతో మహారాష్ట్రాల్లో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.5వేల8వందల మందికిపైగా వరదబాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో..రాష్ట్రవ్యాప్తంగా 54రోడ్లను మూసేశారు. 

కొల్హాపూర్ జిల్లాలో పంచగంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది.  ప్రమాదకరస్థాయిని దాటి 46అడుగల మేర ప్రవహిస్తోంది. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో 68మిల్లీమీటర్ల వాన పడ్డది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద రావడంతో.. రాధానగరి, దూద్ గంగా, వార్ణ డ్యామ్ ల గేట్లు తెరిచి..దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.  

Also Read :- జులై 28న వైన్స్​ బంద్

నవీ ముంబైలోని షాబాజ్ గ్రామంలో మూడంతస్తుల బిల్డింగ్ కుప్పకూలింది.  ఇద్దరు వ్యక్తులను రెస్క్యూ చేశారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. శిథిలాల కింద ఉన్న మరో ఇద్దరి కోసం సహాయక చర్యలు చేపట్టారు. ఇటు గుజరాత్ లోనూ అదే పరిస్థితి కనిపిస్తుంది. గుజరాత్ లోనూ భారీ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. గిర్ జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. నవ్ శ్రీ జిల్లాలో వరదల్లో చిక్కుకున్న 30మందిని రెస్క్యూ చేశారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. వరదలతో నిరాశ్రయులైన వారి కోసం 20వేల ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేపట్టారు అధికారులు.