ఈ నగరాల్లో ఇంటి అద్దెలు భారీగా పెరిగాయి

హైదరాబాద్, ముంబై, కోలకతా, బెంగళూరు లాంటి మహానగరాల్లో సామాన్యులు జీవించడం కష్టంగా మారింది. దేశంలోని ఈ కాస్మోపాలిటన్ నగరాల్లో ప్రవాసులకు జీవ నం అందని ద్రాక్షలా మారింది. ముఖ్యంగా ఇంటి అద్దెలు బాగా పెరిగిపోయాయి. ఇటీవలి 2024 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వేల ప్రకారం.. ప్రవాసులకు  కాస్మోపాలిటన్ నగ రాలు అత్యంత ఖరీదుగా మారాయి. బెంగళూరు, పుణె, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో  ఇంటి అద్దెలు గణనీయంగా పెరిగాయి. 

కాస్ట్ లివింగ్ సర్వే ప్రకారం.. బెంగళూరులో 3-6 శాతం ఇంటి అద్దెలు పెరిగాయి. పుణె, హైదరబాద్, చెన్న నగరాల్లో 2-4 శాతం, ఢిల్లీలో 12-15 శాతం,ముంబైలో 6-8 శాతం ఇంటి అద్దెలు పెరిగాయి.
హెచ్ ఆర్ కన్సల్టెన్సీ మెర్సర్ ఇటీవలి 2024 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారం.. దేశంలోని కాస్మోపాలిటన్ నగరాల్లో ఒకటైన ముంబై అత్యంత ఖరీదైన నగరంగా ర్యాంక్ పొందింది. లగ్జరీ లైఫ్, ఫైనాన్షియల్ కేపిటల్ కావడంతో ముంబై 2013 నుంచి కాస్ట్ ఆఫ్ లివింగ్ లో అగ్రస్థానంలో ఉంది. గతేడాదితో పోలిస్తే ముంబై 11 స్థానాలు ఎగబాకి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 226 నగరాల్లో 136 వ స్థానంలో ఉంది. 
సర్వే ర్యాంకింగ్స్ లో మన దేశ నగరాలు : 
న్యూఢిల్లీ: 164వ స్థానం
చెన్నై-189వ స్థానం
బెంగళూరు -195స్థానం
హైదరాబాద్ -202వ స్థానం
పుణె -205వ స్థానం
 కోల్ కతా -207వ స్థానం
అత్యంత ఖరీదైన నగరాల్లో ముంబై ఆసియాలోనే 21వ స్థానంలో ఉంది. దేశ రాజధాని ఢిల్లీ 30వ స్థానంలో ఉంది. 
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు 
ప్రపంచంలోని టాప్ 10 ఖరీదైన నగరాలు: హాంకాంగ్, సింగపూర్, జ్యూరిచ్,జెనీవా, బాసెల్, బెర్న్, న్యూయార్క్ సిటీ, లండన, నసావు, లాస్ ఏంజిల్స్