ప్రధాని మోడీని చంపుతానంటూ బెదిరింపు కాల్.. మహిళ అరెస్ట్

ప్రధాని మోడీని చంపుతానంటూ బెదిరింపు కాల్.. మహిళ అరెస్ట్

బెదిరింపు కాల్స్... ఎయిర్ పోర్టులకు, షాపింగ్ మాళ్లకు బాంబు బెదిరింపు కాల్స్ రావటం తరచూ వింటూనే ఉంటాం. రాజకీయ నాయకులకు కూడా బెదిరింపు కాల్స్ రావటం సహజం. కానీ.. దేశ ప్రధానికి బెదిరింపు కాల్ రావటం అంటే మాములు విషయం కాదు. అవును.. ప్రధాని మోడీని చంపుతానంటూ బెదిరింపు కాల్ చేసింది ఓ మహిళ. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. ముంబై పోలీసులకు ఫోన్‌ చేసి ప్రధాని మోడీని చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడింది ఓ మహిళ. ప్రధాని హత్యకు ప్లాన్‌ చేస్తున్నట్లు బెదిరింపు కాల్ లో పేర్కొంది సదరు మహిళ.

గురువారం ( నవంబర్ 28, 2024 ) ఉదయం ముంబై పోలీసు కంట్రోల్‌ రూమ్‌ కు కాల్ చేసి  ప్రధాని మోడీ హత్యకు ప్లాన్‌ చేస్తున్నట్లు ఫోన్‌  బెదిరించింది 34 ఏళ్ళ మహిళ. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఫోన్ నంబర్ ఆధారంగా ట్రేస్ చేసి బెదిరింపులకు పాల్పడ్డ మహిళను గుర్తించారు.

ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.. అయితే..  సదరు మహిళ మానసిక పరిస్థితి బాగోలేదని దర్యాప్తులో తేలినట్లు తెలిపారు పోలీసులు.