ఫైవ్ స్టార్ హోటల్లో అగ్నిప్రమాదం..భయాందోళనతో జనం పరుగులు

ఫైవ్ స్టార్ హోటల్లో అగ్నిప్రమాదం..భయాందోళనతో జనం పరుగులు

ముంబైలోని భారీ భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.  ట్రైడెంట్ హోటల్ భవనం నుంచి భారీగా పొగలు రావడం స్థానికంగా కలకలం రేపింది. బిల్డింగ్ పై  భాగం నుంచి దట్టమైన పొగలు బయటకు రావడం చూసి స్ధానికులు భయాందోళనకు గురయ్యారు. 

ముంబైలోని నారిమన్ పాయింట్‌లో ట్రైడెంట్ హోటల్ ఉంది. అయితే ఈ హోటల్ పైభాగంలో  ఉదయం 7 గంటలకు దట్టమైన పొగలు వచ్చాయి. దీంతో అక్కడున్న జనం ఆందోళన బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారు. ట్రైడెంట్ హోటల్  నుంచి పొగలు రావడంతో  ఈ  దృశ్యాలను స్థానికులు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. 

అగ్నిప్రమాదమా..కాదా..

ట్రైడెంట్ హోటల్‌లో అగ్నిప్రమాదం జరిగిందంటూ వచ్చిన వార్తలును  ముంబై పోలీసులు ఖండించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. హోటల్ బాయిలర్ రూం నుంచి పొగలు వస్తున్నాయని తెలిపారు. దీని వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. దీంతో హోటల్ లోని కస్టమర్లు, పరిసర ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.