SMAT 2024: ఇది కదా మ్యాచ్ అంటే: ముస్తాక్ అలీ ట్రోఫీ సెమీస్‌లో పాండ్యతో సూర్య ఢీ

దేశంలో టీ20 ఫార్మాట్ లో జరిగే అతి పెద్ద టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చివరి దశకు చేరుకుంది. సెమీ ఫైనల్ కు చేరుకున్న నాలుగు జట్లు నేటితో (డిసెంబర్ 11) తేలిపోనున్నాయి. ఇప్పటికే బరోడా, ముంబై జట్లతో పాటు మధ్య ప్రదేశ్ జట్లు సెమీస్ కు అర్హత సాధించాయి. ఢిల్లీ లేదా లేదా ఉత్తర ప్రదేశ్ జట్లలో గెలిచిన జట్టు సెమీస్ అడుగుపెడుతుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఒక సెమీస్ ఖరారైంది. తొలి సెమీ ఫైనల్లో బరోడాతో ముంబై తలబడుతుంది. 

ఈ మ్యాచ్ శుక్రవారం (డిసెంబర్ 13) జరుగుతుంది. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. బరోడా తరపున హార్దిక్ పాండ్య.. ముంబై తరపున సూర్య యాదవ్ ఉండడడంతో ఈ మ్యాచ్ ఆసక్తిని కలిగిస్తుంది. వీరిద్దరూ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు కలిసి ఆడుతున్న సంగతి  తెలిసిందే. ఇద్దరూ కూడా భారత జట్టును నడిపించిన వారే. దీంతో ఈ రెండు జట్లలో ఏ జట్టు గెలుస్తుందో చెప్పడం అభిమానులకి కష్టంగా మారింది.

ALSO READ | Smriti Mandhana: ఏడాదిలో నాలుగోది.. ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పిన మంధాన

ముంబై జట్టుకు శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ కాగా.. బరోడా జట్టును హార్దిక్ సోదరుడు కృనాల్ నడిపిస్తున్నాడు. బెంగాల్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో బెంగాల్ పై బరోడా 41 పరుగులతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బెంగాల్ 131 పరుగులకే ఆలౌట్ అయింది. మరో సెమీ ఫైనల్లో విదర్భపై ముంబై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బరోడా 20 ఓవర్లలో 6 వికెట్లకు 221 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ముంబై మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేజ్ చేసింది.