
అది వాటర్ ఫౌంటెన్ కాదు.. కానీ దానిని మించి ఎగిసిపడుతోంది. ఒకటి కాదు రెండు దాదాపు 10 అంతస్తు భవనం పైకప్పు వరకు నీరు చిమ్ముతోంది. వందల అడుగుల మేర నీరు గాల్లోకి ఎగిసిపడుతోంది. దీంతో చుట్టు పక్కల ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ముంబైలోని అంధేరీ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం వాటర్ పైప్ లైన్ పగిలిపోవడంతో ఈ దృశ్యానికి సంబందించిన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బుధవారం ముంబై అంధేరీలోని ఓషివారా వద్ద వాటర్ పైప్ లైప్ పగిలిపోవడంతో వీధుల వెంట నీరు వృధాగా పోయింది. పది అంతస్తుల భవనం పైకి గాల్లోకి నీరు చిమ్మింది. పైపులైన్ పగిలి లక్షల లీటర్ల నీరు వృథాగా పోయింది. వీధులన్నీ జలమయమయ్యాయి. భారీగా వరదలు పోటెత్తిన వీధి గుండా ప్రజలు తమ దారిన వెళ్లడం కనిపించింది. ఇది స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మధ్యాహ్నం 2.45 గంటలకు పశ్చిమ అంధేరీలోని ఓసివార వద్ద ఇన్ఫినిటీ మాల్ ఎదురుగా ఈ అనుకోని వాటర్ ఫౌంటెన్ ఎగిసిపడింది.
ఈ ఘటన కారణంగా మిల్లత్ నగర్, ఎస్వీపీ నగర్, ఎంహెచ్‌ఏడీఏ, లోఖండ్‌వాలా వంటి కొన్ని ప్రాంతాల్లో పైప్‌లైన్ మరమ్మతు పనులు పూర్తయ్యే వరకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.120 మీటర్ల వ్యాసం ఉన్న పైప్ లైన్ పగిలిపోవడం వల్ల వాటర్ వృధాగా పోయిందని.. హైడ్రాలిక్ విభాగం మొదట పైప్‌లైన్‌లో నీటి సరఫరాను నిలిపివేసి, వెంటనే మరమ్మతు పనిని చేపట్టిందని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) తెలిపింది.
Adarsh nagar road
— ANDHERI LOKHANDWALA OSHIWARA CITIZEN'S ASSOCIATION (@AndheriLOCA) August 23, 2023
Lokhandwala
Andheri W
Pipe burst
Pls Avoid this area@ranjjatwork@Thearjunbijlani@FanViveck@IAmSudhirMishra @Mumbaikhabar9 @VikasKalantri@karangrover22@atulmohanhere@jkd18@mantramugdh@tiscatime@saumyatandon@Divyanka_T@karantacker@GurpreetKChadha… pic.twitter.com/smBiYZdN2r
— Jitendra (@jitssss) August 23, 2023