సోషల్ మీడియా పుణ్యమా అని కొంతమంది రాత్రికి రాత్రే సెలబ్రెటీలుగా మారిపోతున్న విషయం తెలిసిందే. తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకోవాలన్న క్యూరియాసిటితో కొంతమంది చిత్ర విచిత్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం, ప్రాణాలకు తెగించి సాహసాలు చేయడం లాంటివి చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తున్నారు. కొన్నిసార్లు వారు చేస్తున్న సాహసాల వల్ల ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు కదిలే రైల్లో ఓ యువకుడు రీల్స్ చేస్తూ కాలు, చేయి పోగొట్టుకున్నాడు.. వివరాల్లోకి వెళ్తే...
ముంబై ఫర్హాత్ మసీదు స్టేషన్ లో కదిలే రైలులో ఓ యువకుడు రీల్స్ చేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో ఆ యువకుడు ఎడమకాలు, చేయి కోల్పోయాడు. ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న సెంట్రల్ రైల్వే (CR) ఇతరులకు కూడా హాని కలిగించే ఇటువంటి విన్యాసాలకు వ్యతిరేకంగా కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. ఈ యువకుడు చేసిన రీల్స్ విషయం వడాలా రోడ్లోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) పోస్ట్ పుటేజీలో రికార్డ్ అయింది. ఈ ఫుటేజ్ ఆధారంగా ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
వాడాలాలోని ఆంటోప్ హిల్లో నివసించే ఫర్హత్ ఆజం షేక్ అని గుర్తించారు. వీడియోలోని సంఘటన గురించి ఆరా తీయగా.. మార్చి 7న CSMT వెళ్లే రైలులో సెవ్రీ స్టేషన్లో చట్టవిరుద్ధమైన చర్యకు పాల్పడ్డాడని ధృవీకరించారు. అతను పాపులర్ అయ్యేందుకు .. సోషల్ మీడియాలో ఈ రీల్స్ ను అప్ లోడ్ చేస్తాడు.
ఏప్రిల్ 14న ఫర్హాత్ మసీదు స్టేషన్లో మరొక స్టంట్ చేస్తున్నప్పుడు ప్రాణాపాయ ప్రమాదానికి గురయ్యాడుఈ ప్రమాదంలో అతని ఎడమ చేయి మరియు కాలు కోల్పోయాడు.. రైల్వే అధికారులు అతడిని చికిత్స నిమిత్తం చికిత్స నిమిత్తం సెయింట్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు.
రైల్వే యంత్రాంగం అతడిని చికిత్స నిమిత్తం సెయింట్ జార్జ్ ఆసుపత్రి, CSMTకి తరలించారు. ప్రస్తుతం అజం షేక్ రోజువారీ కార్యక్రమాలు చేసుకొనేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నాడని రైల్వే అధికారులు తెలిపారు.