ముంబై లాల్ బాగ్చా రాజాకి కనక వర్షం.. కోట్ల డబ్బు, కిలోల బంగారం

ముంబై లాల్ బాగ్చా రాజాకి కనక వర్షం.. కోట్ల డబ్బు, కిలోల బంగారం

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వినాయక చవితి ఉత్సవాలు ఎంతో గ్రాండ్‎గా నిర్వహిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశవ్యాప్తంగా వినాయక ఉత్సవాలు అంగరంగ వైభంగా జరిగినప్పటికీ.. ముంబై చవితి వేడుకలు మాత్రం ప్రత్యేకం. అందులోనూ ముఖ్యంగా ముంబైలో కొలువుదీరే లాల్ బాగ్చా రాజా గణపతి వెరీ స్పెషల్. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు సైతం లాల్ బాగ్చా రాజా దర్శనం కోసం క్యూలు కడతారంటే అర్థం చేసుకోవచ్చు లాల్ బాగ్చా రాజా క్రేజ్ ఏలాంటిదో. 

ALSO READ : వినాయకుడు ఏ ప్రదేశంలో జన్మించాడో తెలుసా. 

ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న లాల్ బాగ్చా రాజాకు కానుకలు సైతం అదే రేంజ్‎లో వస్తుంటాయి. లాల్ బాగ్చా రాజాపై భక్తులు డబ్బులు, బంగారం, వెండి వంటి కానుకల వర్షం కురిపిస్తారు.  ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా ప్రసిద్ధ లాల్ బాగ్చా రాజాకు భక్తులు భారీగా విరాళాలు సమర్పించినట్లు ఉత్సవ కమిటీ నిర్వాహకులు వెల్లడించారు. మొత్తం తొమ్మిది రోజుల ఉత్సవాల్లో భాగంగా రూ.5.65 కోట్ల నగదు, 4.15 కిలోల బంగారం, 64 కిలోల వెండితో పాటు వివిధ రకాల వస్తువులు లాల్ బాగ్చా రాజాకు కానుకల రూపంలో వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఏడాదిలాగే ఈ సారి  కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా సక్సెస్ ఫుల్‎గా ముంబై లాల్ బాగ్చా రాజా ఉత్సవాలు ముగిసిట్లు పేర్కొన్నారు. 


ఈ ఏడాది వచ్చిన విరాళాలు:

  •  రూ.5.65 కోట్ల నగదు
  • 4.15 కిలోల బంగారం
  • 64 కిలోల వెండి