DC vs RR: ఢిల్లీ బౌలింగ్ కోచ్‌కు బీసీసీఐ భారీ జరిమానా.. ఎందుకంటే..?

DC vs RR: ఢిల్లీ బౌలింగ్ కోచ్‌కు బీసీసీఐ భారీ జరిమానా.. ఎందుకంటే..?

ఐపీఎల్ 2025 లో బుధవారం (ఏప్రిల్ 16) రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్ ను థ్రిల్ కు గురి చేసింది. అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ మొదట టై అయింది. సూపర్ ఓవర్ థ్రిల్లర్ లో రాజస్థాన్ రాయల్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 12 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఒక రెండు బంతులు మిగిలి ఉండగానే థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. సూపర్ ఓవర్ జరుగుతున్న సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్ ఐపీఎల్ రూల్ కోడ్ ఉల్లంఘించినట్టు తేలింది.  

డగౌట్ లో నాలుగో అంపైర్ తో గొడవ పడ్డాడు. బౌండరీ బయట ఉన్న మునాఫ్ పటేల్.. తన జట్టులో ఒక ప్లేయర్ కు ఏదో మెసేజ్ చెప్పి   అతడిని గ్రౌండ్ లోకి పంపేందుకు ప్రయత్నించాడు. అయితే అక్కడే ఉన్న నాలుగో అంపైర్ పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో ఢిల్లీ బౌలింగ్ కోచ్ అంపైర్ తో వాగ్వాదానికి దిగాడు. ఆర్టికల్ 2.20 ప్రకారం మునాఫ్ పటేల్ ఆట రూల్స్ కు విరుద్ధంగా ప్రవర్తించినట్టు తేలింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్ కు బీసీసీఐ భారీ జరిమానా విధించింది. ఐపీఎల్ రూల్స్ బ్రేక్ చేసినందుకు మునాఫ్ కు మ్యాచ్ ఫీజులో 25% ఫైన్ వేశారు. దీంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ విధించబడింది. 

►ALSO READ | IPL ఫిక్సింగ్ ఆరోపణలపై హైదరాబాద్ పోలీసుల ఆరా.. ఐదుగురిపై అనుమానం..! 

జేమ్స్ హోప్స్ స్థానంలో 2025 సీజన్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్ గా మునాఫ్ పటేల్ ను నియమించారు. 2018లో ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి రిటైరైన మునాఫ్‌ తన కెరీర్‌‌లో తొలిసారి హై ప్రొఫైల్‌ కోచింగ్‌ బాధ్యతలు చేపడుతున్నాడు. మునాఫ్ ఇండియా తరఫున అన్ని ఫార్మాట్లలో 86 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడి 125 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్ (2008), ముంబై ఇండియన్స్ (2013)కు ప్రాతినిథ్యం వహించాడు.