మణికొండ చిత్రపురి కాలనీలో 225 విల్లాలకు నోటీసులు

మణికొండ చిత్రపురి కాలనీలో  225 విల్లాలకు నోటీసులు

మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని చిత్రపూరి కాలనీలో  225 విల్లాలకు  మణికొండ మున్సిపల్ కమీషనర్ నోటీసులు అందజేశారు. జీవో 658కి విరుద్దంగా 225 ROW హౌస్ల నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు.  జీ+1కు అనుమతులు పొంది జీ+2 నిర్మాణాలు నిర్మించారు బిల్డర్లు. 15 రోజుల్లో నోటీసులకు రిప్లై ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ సూచించారు. లేకపోతే   కూల్చివేతలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేశారు.

గత పాలక వర్గం తప్పుడు నిర్ణయం వల్ల చిత్రపూరి సొసైటీకి సుమారు 50 కోట్ల నష్టం జరిగిందంటూ ఫిర్యాదులు అందాయి. చిత్రపూరిలో జరిగిన అవకతవకల గుట్టును రట్టు చేయాలంటూ ఫిర్యాదులు రావడంతో  మణికొండ మున్సిపల్ కమిషనర్  నోటీసులు జారీ చేశారు.