సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కు తాళం

నిర్మల్, వెలుగు :  నిర్మల్  సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు మున్సిపల్ అధికారులు గురువారం తాళం వేశారు.  ఆస్తిపన్ను బకాయిలు కట్టకపోవడంతో  ఆఫీసుకు తాళం వేయడంతో  రిజిస్ట్రేషన్ల  కో సం వచ్చిన ప్రజలు   ఇబ్బంది పడ్డారు.  

ఇంటి పన్నుల వసూళ్ల కోసం మున్సిపల్​ అధికారులు కొద్దిరోజులుగా  స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.  ఇందులో భాగంగా  సబ్ రిజిస్ట్రార్  ఆఫీసు బకాయి పడిన రూ. 1. 57 లక్షలు చెల్లించాలని  నోటీసు జారీ చేశారు. అయితే, సబ్ రిజిస్ట్రార్ నుంచి స్పందన లేకపోవడంతో  తాళాలు వేసినట్టు చెప్తున్నారు.