
జోగిపేట, వెలుగు : సంగారెడ్డి జిల్లా ఆందోల్ -జోగిపేట పురపాలక సంఘానికి చెందిన అద్దె షాపులను మున్సిపల్ అధికారులు గురువారం సీజ్‌చేశారు. గాంధీ పార్క్ షాపింగ్ కాంప్లెక్స్ లోని దుకాణ సముదాయంలో కొంతమంది షాపుల అద్దె చెల్లించకపోవడం వల్ల 4 షాప్‌లు సీజ్ చేశారు.
బకాయి చెల్లించే విషయంలో ఇది వరకే పలుమార్లు నోటీసు ఇచ్చినప్పటికీ అద్దె చెల్లించడంలేదని ఇన్‌చార్జి రెవెన్యూ ఇన్స్పెక్టర్నారాయణ చెప్పారు. మొండి బకాయిలు ఉన్న షాప్‌లను 2019 పురపాలక చట్టం, రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం సీజ్ చేసినట్లు తెలిపారు.