నిర్మల్, వెలుగు: నిర్మల్ పట్టణాభివృద్ధికి అవసరమైన నిధులు విడుదల చేయాలని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, డీసీసీ ప్రెసిడెంట్ శ్రీహరి రావు హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వినతి పత్రాన్ని సీఎంకు అందించారు. గతంలో మంజూరైన రూ.80 కోట్ల టీయూఎఫ్ ఐడీసీ, ఎస్ డీఎఫ్ నిధులను విడుదల చేయాలని కోరారు.
పట్టణంలోని పాత బస్తీలో రోడ్డు వెడల్పులో భాగంగా ఇండ్లు కోల్పోయిన 173 మంది బాధితులకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలని కోరారు. పాత ఎమ్మార్వో ఆఫీస్ వద్ద కూరగాయల మార్కెట్ కోసం మంజూరైన రూ.కోటి నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన సీఎం నిధుల విడుదలకు హామీ ఇచ్చారు.