ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ లో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. గురువారం పట్టణంలోని శాంతినగర్ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువకులు బీఆర్ఎస్లో చేరారు.
గత ప్రభుత్వాల హయాంలో ఎదుర్కొన్న ఎన్నో సమస్యలను కేసీఆర్ ప్రభుత్వం పరిష్కరించిందన్నారు. కాంగ్రెస్ పాలనలో విపరీతమైన కరెంటు కోతలు ఉండేవని, వేసవి వస్తే 9 గంటల కరెంటు మాత్రమే ఇచ్చేవారని గుర్తు చేశారు. ప్రజలకు మంచి నీటిని కూడా సరిగా ఇవ్వలేదని, కానీ రాష్ట్రంలో ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవన్నారు. బీఆర్ఎస్కు ఓటేసి గెలిపించాలని కోరారు.