జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాలలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. జగిత్యాల మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, బీఆర్ఎస్ కౌన్సిలర్ తిరుపతమ్మతో పాటు, ఇండిపెండెంట్ కౌన్సిలర్ మల్లవ్వ, బీఆర్ఎస్ నాయకులు సోమవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. జగిత్యాల మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నిక నిర్వహించగా బీఆర్ఎస్‌కు చెందిన 12 మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపారు.
దీంతో పురపాలక చైర్‌పర్సన్‌గా జ్యోతి ఎంపికయ్యారు. బీఆర్ఎస్ నాయకులు, యువ న్యాయవాది మహేందర్, ముఖేష్ ఖన్నా, సత్యం,వెంకటయ్య, తిరుమలయ్య పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని సూచించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్, మాజీ మున్సిపల్ చైర్మన్లు నాగభూషణం, విజయలక్ష్మి, శంకర్, నందయ్య, అనిత, దుర్గయ్య, రాజేందర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.