సిద్దిపేట రూరల్, వెలుగు: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగని మున్సిపల్ చైర్పర్సన్ కడవేరుగు మంజుల అన్నారు. గురువారం పట్టణంలోని భరత్ నగర్, శ్రీవాణి హై స్కూల్ యాజమాన్యం నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో మాత్రమే పూలను పూజిస్తామన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బతుకమ్మను రాష్ట్ర పండుగ గా గుర్తించిందన్నారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ సత్యం, పాఠశాల యాజమాన్యం, స్టూడెంట్స్ పాల్గొన్నారు.
ALSO READ: జూలూరుపాడు బీఆర్ఎస్ లో అసమ్మతి!