
నారాయణపేట, వెలుగు: నారాయణపేట మున్సిపల్ చైర్పర్సన్ గందే అనసూయ చంద్రకాంత్ గురువారం నియోజకవర్గ ఇన్చార్జి శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. రెండు రోజుల కింద నలుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరగా, తాజాగా మున్సిపల్ చైర్పర్సన్ పార్టీ మారడం గమనార్హం. ఈ సందర్భంగా గందే అనసూయ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారుతున్నట్లు తెలిపారు. గతంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్ లో చేరానని గుర్తు చేశారు. సీఎం నారాయణపేట పర్యటన సందర్భంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పట్టణ అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారని పేర్కొన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ హరి నారాయణ భట్టాడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ బండి వేణుగోపాల్, కౌన్సిలర్లు సలీం, మహేశ్, అమీరుద్దీన్ ఉన్నారు.