ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ మున్సిపాలిటీలోని 36 వార్డులకు రూ.5 లక్షల చొప్పున నిధులు కేటాయిస్తున్నట్లు మున్సిపల్కమిషనర్ ఎ.రాజు తెలిపారు. శుక్రవారం ఇన్చార్జి చైర్మన్ షేక్ మున్ను అధ్యక్షతన మున్సిపల్ సమావేశం జరిగింది. సమావేశంలో కౌన్సిలర్లు తమ వార్డుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరగా, అత్యధిక సమస్యలున్న చోట ఎక్కువ నిధులు కేటాయిస్తామని కమిషనర్ తెలిపారు.
గతంలో ఇంటి నంబర్ల పేరుతో అవినీతి జరిగిందని కౌన్సిలర్లు సమావేశం దృష్టికి తీసుకురాగా, విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కమిషనర్చెప్పారు. డీజిల్వాడకం, హ్యాండ్ బోర్ల రిపేర్ల పేరుతో దొంగ బిల్లులు సృష్టించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జీవీ నర్సింహారెడ్డి ఆరోపించారు. ఈ విషయమై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.