భైంసా, వెలుగు: ఏసీబీ వలలో నిర్మల్‌జిల్లా భైంసా మున్సిపల్కమిషనర్తో పాటు బిల్కలెక్టర్చిక్కారు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి కథనం ప్రకారం.. భైంసాలోని పురాణాబజార్కు చెందిన రాధేశ్యాం 2022లో మున్సిపల్అనుమతులు తీసుకుని ఇంటి నిర్మాణం చేపట్టారు. రూల్స్‌కు విరుద్ధంగా ఇల్లు కడుతున్నావని, కూల్చేస్తామని మున్సిపల్కమిషనర్వెంకటేశ్వర్రావు, బిల్ కలెక్టర్ విద్యాసాగర్మూడు నెలలుగా బెదిరిస్తున్నారు. పలుమార్లు నోటీసులు కూడా ఇచ్చారు.
దీంతో రాధేశ్యాం మున్సిపల్‌కమిషనర్‌ను కలవగా రూ.30వేలు లంచం ఇస్తే ఏం కాదని, లేకపోతే కూల్చక తప్పదని బెదిరించాడు. దీంతో ఏసీబీని ఆశ్రయించగా వారి సూచనల మేరకు బుధవారం రూ.30వేలు తీసుకొని మున్సిపల్ఆఫీస్కు వచ్చాడు. కమిషనర్అందుబాటులో లేకపోవడంతో డబ్బులను బిల్ కలెక్టర్విద్యాసాగర్కు ఇవ్వాలని చెప్పాడు. అతడు చెప్పినట్టే చేస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మున్సిపల్కమిషనర్వెంకటేశ్వర్రావు అప్పటికే ఆయన నిర్మల్‌లో మీటింగ్‌కు వెళ్లగా నిర్మల్–-భైంసా రోడ్డుపై ఉన్న దిలావర్పూర్టోల్ప్లాజా దగ్గర అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ దాడుల్లో ఏసీబీ సీఐ కృష్ణకుమార్ పాల్గొన్నారు.