![వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు : చాహత్ బాజ్‌పాయ్](https://static.v6velugu.com/uploads/2025/02/municipal-commissioner-chahat-bajpai-ordered-officials-to-take-steps-drinking-water-is-not-problem-in-summer_ksIydMpW1g.jpg)
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ బల్దియా పరిధిలోని ప్రజలకు వేసవిలో తాగునీటి సమస్య లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మున్సిపల్ ఆఫీస్‌లో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అమృత్ మిత్ర ప్రాజెక్టు కింద హౌజింగ్ బోర్డు, రాంనగర్, శాతవాహన యూనివర్సిటీ, జ్యోతినగర్, మార్కెట్ ఏరియాల్లోని మంచినీటి రిజర్వాయర్లను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని నీటి డిమాండ్, నాణ్యత పరీక్ష చేయాలన్నారు.
క్షేత్రస్థాయిలో లీకేజీలు,మరమ్మత్తులు చేపట్టడంతో పాటు నీటిపన్నులు వసూలయ్యేలా చూడాలన్నారు. అనంతరం మహిళా సంఘాలతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఖాదర్, మెప్మా పీడీ వేణుమాదవ రెడ్డి, డీఎంసీ శ్రీవాణీ, టీఎంసీ అనిత పాల్గొన్నారు.