కాశీబుగ్గ(కార్పొరేషన్) / మహబూబాబాద్/ జనగామ అర్బన్/ ములుగు, వెలుగు : గ్రీవెన్స్ అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో భాగంగా వారు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. గ్రేటర్వరంగల్ బల్దియా కార్యాలయంలో మున్సిపల్కమిషనర్ అశ్విని తానాజీ వాకడే వినతులను స్వీకరించి, సంబంధిత శాఖ ఆఫీసర్లకు అందజేసి, త్వరగా పరిష్కరించాలని సూచించారు.
మహబూబాబాద్కలెక్టరేట్లో కలెక్టర్అద్వైత్కుమార్సింగ్అడిషనల్కలెక్టర్లు లెనిన్వత్సల్టొప్పో, వీరబ్రహ్మాచారితో కలిసి 104 వినతులు తీసుకున్నట్లు తెలిపారు. జనగామలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో కలెక్టర్రిజ్వాన్బాషా షేక్అడిషనల్కలెక్టర్లు పింకేశ్‌కుమార్, రోహిత్‌సింగ్‌తో కలిసి 24 అర్జీలను స్వీకరించారు. ములుగులో ప్రజల నుంచి వివిధ సమస్యలపై 54 దరఖాస్తులు వచ్చాయని అడిషనల్కలెక్టర్సీహెచ్మహేందర్జీ తెలిపారు.