
అశ్వారావుపేట, వెలుగు: నూతనంగా అశ్వారావుపేట మున్సిపాలిటీగా ఏర్పడిన కారణంగా కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ కాకపోవడంతో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు గృహ అనుమతులను అందించడంలో జాప్యం జరిగిందని మున్సిపల్ కమిషనర్ సుజాత అన్నారు.
మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు మీ సేవల ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని దరఖాస్తు చేసుకున్న రెండు రోజుల్లో సర్టిఫికెట్లు అందజేస్తున్నట్లు స్పష్టం చేశారు.