
మంచిర్యాల, వెలుగు: నస్పూర్మున్సిపల్కమిషనర్గా పనిచేసిన తన్నీరు రమేశ్సస్పెండయ్యారు. అక్రమంగా బిల్డింగ్పర్మిషన్లు జారీ చేసినందుకు ఆయనను సస్పెండ్‌చేస్తూ మున్సిపల్అడ్మినిస్ట్రేషన్ జాయింట్డైరెక్టర్మంగళవారం ఆర్డర్స్జారీ చేశారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న రమేశ్.. అంతకుముందు నస్పూర్ లో బాధ్యతలు నిర్వహించారు. ఆయన ఫిబ్రవరి 1 నుంచి 14 వరకు మెడికల్ లీవ్‌పై వెళ్లారు. లీవ్‌లో ఉండగానే 13న చేర్యాలకు ట్రాన్స్ఫర్అయ్యారు. కానీ 14న సాయంత్రం 5.30 నుంచి రాత్రి 11 గంటల మధ్య హడావుడిగా 9 బిల్డింగ్ లకు పర్మిషన్లు జారీ చేశారు.
ఈ విషయాన్ని ‘వెలుగు’ పేపర్బయటపెట్టింది. ‘అర్ధరాత్రి హౌస్పర్మిషన్లు’ పేరుతో ఫిబ్రవరి 18న స్టోరీ పబ్లిష్ చేసింది. దీనిపై స్పందించిన మున్సిపల్ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. వరంగల్ రీజినల్ డైరెక్టర్ వచ్చిఎంక్వయిరీ జరిపారు. 9 బిల్డింగ్పర్మిషన్లలో రెండింటిని టీపీఎస్ రికమండ్చేయకుండానే కమిషనర్ రమేశ్ అప్రూవ్చేసినట్టు గుర్తించారు. అలాగే కలెక్టర్సంతోష్మంచిర్యాల ఆర్డీఓతో ఎంక్వయిరీ జరిపించి రిపోర్ట్సమర్పించారు. ఈ మేరకు రమేశ్అక్రమంగా బిల్డింగ్పర్మిషన్లు ఇచ్చినట్టు రుజువు కావడంతో ఆయనను సస్పెండ్ చేశారు.