
కోల్‌బెల్ట్,వెలుగు: చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామిని క్యాతనపల్లి మున్సిపల్ కాంగ్రెస్ కౌన్సిలర్లు మంగళవారం రాత్రి గోదావరిఖని ఎన్టీపీసీలో కలిశారు. క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్‌రెడ్డిపై బీఆర్ఎస్ కౌన్సిలర్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ శిబిరం నుంచి చైర్పర్సన్, వైస్ చైర్మన్, కాంగ్రెస్ కౌన్సిలర్లు వచ్చి ఎమ్మెల్యే వివేక్‌ను కలిశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్యాతనపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని కౌన్సిలర్లకు సూచించారు. కౌన్సిలర్లు పోలం సత్యనారాయణ, రాజు, కొక్కుల స్రవంతి, పుల్లూరి సుధాకర్, మేకల తిరుమల, కాంగ్రెస్ లీడర్లు పల్లె రాజు, ఓడ్నాల శ్రీనివాస్, గోపతి రాజయ్య, నీలం శ్రీనివాస్‌గౌడ్, ఎండి.అబ్దుల్ అజీజ్, మహంకాళీ శ్రీనివాస్, రాజేశ్, సత్యనారాయణ, రమేశ్, మల్లయ్య ఉన్నారు.