
కాగజ్ నగర్, వెలుగు: మున్సిపల్ కార్మికులు తమ పెండింగ్ వేతనాలు చెల్లించాలని, పీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలని కాగజ్ నగర్ మున్సిపల్ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. ఉదయం 5 గంటలకు పారిశుద్ధ్య పనులకు వెళ్లకుండా మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేశారు.
మున్సిపల్ కమిషనర్ అంజయ్య అక్కడకు చేరుకొని బకాయి పడ్డ వేతనాలు వెంటనే చెల్లిస్తామని ఈఎస్ఐ, పీఎఫ్ డబ్బులు ఫిబ్రవరిలో వ్యక్తిగత ఖాతాలో జమ చేస్తానని హమీ ఇచ్చారు. దీంతో కార్మికులు ధర్నా విరమించారు.