
దుబ్బాక, వెలుగు: దుబ్బాక పట్టణాన్ని రూ. 19.40 కోట్లతో డెవలప్ చేయాలని మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. మంగళవారం చైర్పర్సన్గన్నె వనిత అధ్యక్షతన మున్సిపల్ బడ్జెట్సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అథితిగా హాజరై పట్టణ అభివృద్ధి కోసం పలు సూచనలు చేశారు.
దుబ్బాక పట్టణం నుంచి మండల పరిధిలోని హబ్షీపూర్ వరకు ఫోర్‌లైన్ తారు రోడ్డు, మున్సిపాల్టీ చుట్టూ రింగ్‌రోడ్డు, కేసీఆర్స్కూల్నిర్వహణ, వంద పడకల హాస్పిటల్పూర్తి స్థాయి స్టాఫ్, నాన్‌వెజ్, వెజ్ మార్కెట్, ఆడిటోరియం, మినీ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ సౌకర్యం, అండర్ డ్రైనేజ్ వ్యవస్థ, వారాంతపు సంతకు స్థల పరిశీలన, పట్టణం చుట్టూ ఉన్న చెరువులు, కుంటల సుందరీకరణ, అసంపూర్తిగా ఉన్న శ్మశాన వాటికల, కుల సంఘాల భవనాలను పూర్తి చేయాలని కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. సమావేశంలో కమిషనర్రమేశ్కుమార్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.