జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దుకు మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం

జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దుకు మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం

మాస్టర్ ప్లాన్ ముసాయిదా రద్దు చేయాలని జగిత్యాల మున్సిపాలిటీ తీర్మానం చేసింది. మున్సిపల్ ఛైర్మన్ శ్రావణి ఆధ్వర్యంలో జరిగిన  పాలకవర్గం..  తీర్మానం కాపీని ప్రభుత్వానికి అందిస్తామని తెలిపింది. ఈ సందర్భంగా మాట్లాడిన మున్సిపల్ ఛైర్మన్ శ్రావణి..  తాము ప్రజల వైపే ఉంటామని .. రైతులు ప్రతిపక్షాల వలలో పడొద్దని చెప్పారు.  రైతులకు ఆమోదయోగ్యం కానిది ఏదైనా తమకు ఆమోద యోగ్యం కాదన్నారు.

మాస్టర్ ప్లాన్ ను అడ్డం పెట్టుకుని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆరోపించారు. 1996లో  కాంగ్రెస్ హయాంలో తయారు చేసిన  మాస్టర్ ప్లాన్  తప్పుల తడకగా ఉందన్నారు.  కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి హయాంలో జగిత్యాల టౌన్ అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు.  మాస్టర్ ప్లాన్ పై చర్చించడానికి జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళడానికి సిద్ధమన్నారు. మాస్టర్ ప్లాన్ ముసాయిదా మాత్రమేనని..ఈ విషయం జీవన్ రెడ్డికి ఎందుకు అర్థం కాలేదో చెప్పాలన్నారు.  ఇకనైనా  జీవన్ రెడ్డి రైతులను రెచ్చగొట్టడం ఆపాలని హితవు పలికారు.