కేటీఆర్ నియోజకవర్గంలో..కాంగ్రెస్ ‌‌లో చేరిన మున్సిపల్​ కౌన్సిలర్​

సిరిసిల్ల టౌన్, వెలుగు : కేటీఆర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ‌‌కు భారీ షాక్​ తగిలింది. సిరిసిల్ల  మున్సిపల్ 6వ వార్డ్ కౌన్సిలర్ గుండ్లపల్లి రామానుజం గురువారం బీఆర్ఎస్ ‌‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ ‌‌చార్జి కేకే మహేందర్ ‌‌ ‌‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో అక్రమాలు చూడలేకనే పార్టీ మారుతున్నానన్నారు.

బీఆర్ఎస్  పాలనలో  ఇసుక, గంజాయి, ల్యాండ్ మాఫియాను విచ్చలవిడిగా ఉండేదన్నారు.  కార్యక్రమంలో లీడర్లు గుండ్లపల్లి గౌతం, చొప్పదండి ప్రకాశ్, వైద్య శివప్రసాద్, బాలరాజు, మోహన్, శ్రావణ్ పాల్గొన్నారు.