తెలంగాణలోని పలు జిల్లాలో మరోసారి అవిశ్వాసల పర్వం నడుస్తోంది. తాజాగా సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులే టార్గెట్ గా కాంగ్రెస్ నేతలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
కోదాడ మున్సిపల్ చైర్మన్ తో పాటు ఎంపీపీ, PACS చైర్మన్ పై అవిశ్వాసం పెట్టాలని కౌన్సిలర్స్, ప్రజాప్రతినిధులు.. జిల్లా కలెక్టర్ వెంకట్రావును కలిశారు. తమ సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని 27 మంది కోదాడ మున్సిపల్ కౌన్సిలర్స్ అందజేశారు. కోదాడ మున్సిపాలిటీలో మొత్తం 35 వార్డులు ఉన్నాయి.