గ్రూప్ 4కు సెలక్టయినవారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్

హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 4 ద్వారా జూనియర్ అసిస్టెంట్, వార్డ్ ఆఫీసర్లుగా  సెలక్ట్ అయిన అభ్యర్థులకు మున్సిపల్ శాఖ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టనుంది. గురు, శుక్రవారాల్లో  రెండ్రోజుల పాటు మాసాబ్ ట్యాంక్​లోని  సీడీఎంఏ (కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్ ) కార్యాలయంతోపాటు హన్మకొండలోని కుడా కార్యాలయంలో  వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు అధికారులు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ఎంపికైనా సుమారు 1100 మందికి హన్మకొండలోని కుడా కార్యాలయంలో  సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు ఎంపికైన మరో 1,127 మందికి సీడీఎంఏ ఆఫీస్ లో  సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు వివరించారు. అన్ని ఒరిజనల్ మోమోలు, సర్టిఫికెట్లతో వెరిఫికేషన్ కు అటెండ్ కావాలని, గైర్హాజరు అయితే జాబ్ లో జాయిన్ అయ్యేందుకు ఆసక్తి చూపటం లేదన్నట్లుగా నిర్ణయిస్తామని అధికారులు పేర్కొన్నారు.