ప్రజలను మోసం చేసేందుకే మున్సిపల్ జీవో

ప్రజలను మోసం చేసేందుకే మున్సిపల్ జీవో
  • కేసీఆర్ తెచ్చిన జీవోలో కాంగ్రెస్ మార్పులు చేసింది: ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాబు

హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెచ్చిన జీవో 28 లోపభూయిష్టంగా ఉందని, ప్రజలను మోసం చేసేందుకే దీనిని తీసుకొచ్చారని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాబు ఆరోపించారు. శుక్రవారం బీజేపీ స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. 2020లో కేసీఆర్ ఇచ్చిన జీవోలో మార్పులు చేసి కొత్త జీవో తేవడం దుర్మార్గమన్నారు. 

గతంలో పూర్తిస్థాయిలో రిజిస్ట్రేషన్ ఉంటేనే ఎల్ఆర్ఎస్ వచ్చేదని, ఈ కొత్త జీవోతో 10% రిజిస్ట్రేషన్ ఉన్నా.. ఎల్ఆర్ఎస్ అందిస్తున్నారని తెలిపారు. అక్రమంగా లేఔట్ చేసుకునే వారికి లాభం చేకూర్చేలా ఈ జీవో ఉందని విమర్శించారు. గతంలో తెచ్చిన జీవోను వ్యతిరేకించిన మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్, వెంకట్‌‌‌‌ రెడ్డి.. ఇప్పుడు అదే జీవోతో ప్రజలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్ఎస్ పేరుతో రూ.20 వేల కోట్లను అక్రమంగా వసూలు చేసేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.