మెదక్ టౌన్, వెలుగు: మున్సిపల్ కార్మికురాలు మృతి చెంది ఐదు నెలలు గడిచినా ఎలాంటి బెనిఫిట్స్ రాలేదని బాధిత కుటుంబ సభ్యులు మున్సిపల్ ఆఫీస్ వద్ద నిరసన తెలిపారు. పట్టణానికి చెందిన మున్సిపల్ కార్మికురాలు ఐతారం దుర్గమ్మ మే నెలలో మృతి చెందింది. శనివారం మున్సిపల్ జనరల్ బాడీ మీటింగ్ ఉందని తెలుసుకున్న దుర్గమ్మ వారసులు ప్రభాకర్, సుభాష్ మున్సిపల్ ఆఫీస్ కు వచ్చి దుర్గమ్మ ఫొటో పట్టుకుని నిరసన చేపట్టారు.
సంబంధిత అధికారులకు డెత్ సర్టిఫికెట్ అందించినప్పటికీ ఎలాంటి స్పందనలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో వారు నిరసన విరమించారు.