కామారెడ్డి టౌన్, వెలుగు: ఎన్నికల టైమ్‌లో కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తోందని బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి విమర్శించారు. సోమవారం జిల్లా పార్టీ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మాస్టర్ ప్లాన్రద్దుపై మున్సిపల్ ఆఫీసర్లు, కలెక్టర్, కేటీఆర్ ఒక్కో రకంగా చెబుతున్నారన్నారు. మాస్టర్ ప్లాన్రద్దయిన తర్వాత వంద ఫీట్ల రోడ్డు ఆన్లైన్లో ఎలా అప్రూవల్ అయిందో చెప్పాలన్నారు.
మాస్టర్‌ప్లాన్ రద్దు కోసం రైతులు ఆందోళనలు చేస్తే, మున్సిపాలిటీ పాలకవర్గం రద్దు చేస్తున్నట్లు ప్రకటించిందన్నారు. మాస్టర్‌ప్లాన్ రద్దుపై కేటీఆర్‌కు ఏం అధికారం ఉందని, ఆయన మాటలను రైతులు ఎలా నమ్మాలని ప్రశ్నించారు. కామారెడ్డి మాస్టర్‌ప్లాన్ రద్దయితే నిర్మల్, మెట్పల్లి, కరీంనగర్, నిజామాబాద్ మాస్టర్ప్లాన్ల సంగతి ఏమిటన్నారు. కేసీఆర్ ఎక్కడ పోటిచేస్తే అక్కడ మాస్టర్‌ప్లాన్ రద్దు చేస్తారా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓట్ల కోసమే ఇదంతా చేస్తున్నారన్నారు.