మల్కాజిగిరి, వెలుగు: ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ నోమా ఫంక్షన్సమీపంలో ఫుట్‌పాత్‌పై నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన పలు దుకాణాలను కాప్రా మున్సిపల్అధికారులు సోమవారం తొలగించారు.కూల్చివేతలను ఆయా దుకాణాల నిర్వాహకులు అడ్డుకున్నప్పటికీ అధికారులు వాటిని జేసీబీలతో కూల్చివేశారు.
ఫుట్పాత్ఆక్రమణలతో ట్రాఫిక్ సమస్యకు తలెత్తుతుందని టౌన్ ప్లానింగ్ ఏసీపీ గిరిరాజ్ తెలిపారు. నిర్మాణాలన్నీ నిబంధనలకు విరుద్ధంగా వెలిశాయని, వాటిని తొలగించాలని గతంలోనే నోటీసులు ఇచ్చామన్నారు. వారు స్పందించకపోవడంతో కూల్చివేతలు చేపట్టినట్లు చెప్పారు.