![వేములవాడలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్](https://static.v6velugu.com/uploads/2025/02/municipal-officials-conduct-special-drive-on-sanitation-management-in-vemulawada_1PzK2mLn53.jpg)
వేములవాడ, వెలుగు : రానున్న వేములవాడ మహాశివరాత్రి జాతర సందర్భంగా పట్టణంలో శానిటేషన్ నిర్వహణపై మున్సిపల్ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. మంగళవారం రాజన్న ఆలయ పరిసరాల్లోని డ్రైనేజీ కాలువలను మున్సిపల్ కమిషనర్ అన్వేష్, ఆలయ డీఈ మైపాల్ రెడ్డి ఏఈ రామకృష్ణ, ఏఈవో అశోక్ పరిశీలించారు.
ఆలయ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. జాతర కంటే ముందుగానే డ్రైనేజీలను, పట్టణాన్ని క్లీన్‌గా మారుస్తామన్నారు. శానిటేషన్ పర్యవేక్షకుడు వరి నరసయ్య, ఎంక్వైరీ ఆఫీస్ పరివేక్షకుడు శ్రీకాంతచారి, ఆలయ, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.