కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట కూరగాయల మార్కెట్ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసేందుకు మున్సిపల్ అధికారులు ప్రయత్నించారు. దీనిని వ్యాపారస్తులు అడ్డుకున్నారు. కూలిన మార్కెట్ శిధిలాల మధ్యనే వ్యాపారులు టెంట్లు వేసుకుని కూరగాయలు విక్రయిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి పాత కూరగాయల మార్కెట్ వ్యాపారుల ఇష్టానికి వ్యతిరేకంగా మున్సిపాలిటీ దుకాణాలను అధికారులు కూల్చివేశారు. ఆ ప్రాంతాన్ని వదిలేదే లేదంటూ..కూలిన మార్కెట్ శిథిలాల మధ్యనే వ్యాపారులు టెంట్లు వేసుకుని కూరగాయలు విక్రయిస్తున్నారు.
శుక్రవారం మార్కెట్ చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి మున్సిపల్ సిబ్బంది ప్రయత్నించారు. వారిని వ్యాపారులు అడ్డుకున్నారు. తాము ఆ ప్రాంతంలోనే కూరగాయలు విక్రయించుకుంటామని అక్కడి నుండి కదిలేది లేదని స్పష్టం చేశారు దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న వ్యాపారస్తులను పోలీస్ స్టేషన్ కు తరలించి పనులు జరిపిస్తున్నారు.