భద్రాద్రి జిల్లా కొత్తగూడెం రైతు బజార్ దగ్గర వ్యాపారుల షాపులను మున్సిపల్ అధికారులు అర్ధరాత్రి కూల్చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా కూరగాయల షాపులు కూలగొట్టారని, తమను రోడ్డున పడేశారని వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మున్సిపల్ అధికారుల చర్యలకు నిరసనగా సీపీఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తెల్లవారుజామున వచ్చి కూలగొట్టిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే మార్కెట్ కట్టిస్తానని, శంకుస్థాపన చేసిన నెల రోజుల్లోనే మార్కెట్ అందుబాటులో తెస్తానని హామీ ఇచ్చి మరిచిపోయారని వ్యాపారులు మండిపడ్డారు.