గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నీటి కొరత లేదన్నారు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్. సిటీలో నీళ్ళ సరఫరా, టాంకర్ల బుకింగ్స్ పై సమీక్ష నిర్వహించారు. వాటర్ బోర్డ్ ఎండి సుదర్శన్ రెడీ, వాటర్ బోర్డ్ అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన దాన కిషోర్ బెంగుళూరు కంటే వెయ్యి మిలియన్ లీటర్ల నీళ్లు అదనంగా హైదరాబాద్ లో జనానికి అందిస్తున్నామని చెప్పారు. గ్రౌండ్ వాటర్ తగ్గిన చోట ట్యాంకర్ల బుకింగ్స్ వస్తున్నాయని చెప్పారు. మార్చి నుంచి ఇప్పటి వరకు 31 వేల 726 ట్యాంక్ లు బుక్ చేసుకున్నారని చెప్పారు. మార్చితో పోల్చితే 10 వేల మంది వినియోగదారులు పెరిగారన్నారు. ఇవన్నీ కూడా బోర్ వేల్స్ ఎండిపోవడం వలన జరిగిందన్నారు. సిటీలో నీళ్ళ ఎడ్డది లేదన్న విషయం జనానికి చెప్పాలని దాని కిషోర్ అధికారులను ఆదేశించారు.