మున్సిపల్​ కార్మికులకు కనీసం వేతనం ఇవ్వాలి : మున్సిపల్ కార్మికులు

మున్సిపల్​ కార్మికులకు కనీసం వేతనం ఇవ్వాలి : మున్సిపల్ కార్మికులు

హనుమకొండ, వెలుగు: ఏళ్లుగా వెట్టి చాకిరి చేస్తున్నా కనీసం వేతనం ఇవ్వడం లేదని, వెంటనే రూ.26 వేల కనీసం వేతనం చెల్లించాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఐటీయూ‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేశ్ మాట్లాడుతూ కనీస వేతనాల కోసం కార్మికులంతా ఐక్యంగా ఉద్యమాలు చేయడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

అనంతరం మున్సిపల్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.ఉప్పలయ్య మాట్లాడుతూ ప్రమాదాల్లో చనిపోయిన కార్మికుల కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ ప్రావీణ్యకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు బొట్ల భిక్షపతి, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.