మున్నూరు కాపులకు మంత్రి పదవి ఇవ్వాలి.. మున్నూరు కాపు ఆత్మగౌరవ సేన

మున్నూరు కాపులకు మంత్రి పదవి ఇవ్వాలి.. మున్నూరు కాపు ఆత్మగౌరవ సేన

ముషీరాబాద్, వెలుగు: మున్నూరు కాపులకు మంత్రి పదవి ఇవ్వాలని మున్నూరు కాపు ఆత్మగౌరవ సేన రాష్ట్ర కన్వీనర్ ఉగ్గే శ్రీనివాస్ పటేల్ డిమాండ్ చేశారు. ఆదివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద మున్నూరు కాపులు మహా ధర్నా నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ మున్నూరు కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. 

ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.5 వేల కోట్లు మంజూరు చేయాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోకాపేటలో మున్నూరు కాపులకు కేటాయించిన 5 ఎకరాలు, రూ.5 కోట్లు భవన నిర్మాణానికి సరిపోవని, మరో రూ.20 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.  మున్నూరు కాపుల పేరు చివరన పటేల్ అని ప్రభుత్వమే గెజిట్ చేసి, ఇవ్వాలన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు. పీఎల్ఎన్.పటేల్, అర్జున్ సుజాత పాల్గొన్నారు.