ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

విలువలు పెంచేలా రచనలు ఉండాలి

కామారెడ్డి , వెలుగు :  నైతిక విలువలను పెంపొందించే రచనలు అవసరమని తెలంగాణ రచయితల వేదిక ( తెరవే)  జిల్లా ప్రెసిడెంట్​ గఫూర్​ శిక్షక్​ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కర్షక్​ బీఈడీ కాలేజీలో  తెరవే ఆధ్వర్యంలో  ‘బాల సాహిత్యం– కవుల బాధ్యత ’ అనే ఆంశంపై మీటింగ్​ నిర్వహించారు. ఈ సమావేశంలో  గఫూర్​ మాట్లాడుతూ.. సమాజాన్ని అధ్యయనం చేస్తూ  స్టూడెంట్స్​కు ఉపయోగపడే  రచనాలు    రావాల్సిన అవసరముందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు మంద పీతాంబర్,  ఎన్ని శెట్టి గంగాప్రసాద్​, నాగభూషణం, తదితరులు  పాల్గొన్నారు.  

దళితులను మోసగించిన  పాలకులను తరిమికొట్టండి

నిజామాబాద్,  వెలుగు:  దళితులను మోసగించిన టీఆర్​ఎస్​ను వచ్చే ఎన్నికల్లో తరిమి కొట్టాలని బీజేపీ  ఎస్సీ మోర్చ జిల్లా ప్రెసిడెంట్​ శివప్రసాద్​ పిలుపునిచ్చారు.  ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో స్థానిక కంఠేశ్వర్ కమాన్ లో ఆదివారం  బస్తీ అభియాన్  నిర్వహించారు.    ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడారు. దళితులను ఓటు బ్యాంకుగా మార్చుకున్న పార్టీలకు గుణపాఠం  చెప్పాలన్నారు. దళితుడిని సిఎం చేస్తానని, దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ చేస్తానని, దళితుబంధులో టీఆర్​ఎస్​ నాయకులకు ప్రాధాన్యం ఇస్తూ దళితులను వంచిస్తోందని మండిపడ్డారు. బీజేపీ  సామాజిక  న్యాయం తో అన్ని వర్గాల సంక్షేమానికి కృషి  చేస్తోందని చెప్పారు.  లెదర్​ పార్క్​ ల ఏర్పాటుకు కేంద్రం  ప్రాధాన్యతనిచ్చి,   ఎక్కువ నిధులు విడుదల చేసిందన్నారు. ఆర్మూర్​ లో లెదర్​ పార్క్​ ఎదాదిలో ప్రారంభమవుతుందని చెప్పారు. ఎస్సీలకు కేంద్రపథకాలతో పరిశ్రమల స్థాపనకు ఎంపీ అర్వింద్​ కృషి చేస్తున్నారని తెలిపారు.  కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు శివరాజ్ రాజేందర్ శివ చరణ్ బాలయ్య  తదితరులు పాల్గొన్నారు

ఓపెన్​ స్కూల్​ ​అడ్మిషన్లపై దృష్టి పెట్టాలె

పిట్లం, వెలుగు: ఓపెన్​ స్కూల్​ అడ్మిషన్లపై సిబ్బంది దృష్టి పెట్టాలని  ఓపెన్​ స్కూల్​ రాష్ట్ర పరిశీలకురాలు పద్మశ్రీ కోరారు.  పెద్దకొడప్​గల్​ స్టడీ సర్కిల్​ను ఆదివారం  పరిశీలించారు. ఈ సందర్భంగా  గత మూడు సంవత్సరాల నుంచి ఓపెన్​ స్కూల్​లో ప్రవేశాలు, ఫలితాల వివరాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రవేశాలు పూర్తి అయిన తరువాత ప్రతి ఆదివారం, సెలవు దినాల్లో తరగతులు నిర్వహించాలని సూచించారు. అడ్మిషన్​ పొందిన వారికి త్వరలో  పుస్తకాలు అందిస్తామని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో  హెచ్​ఎం చంద్రకాంత్​, స్టడీ సెంటర్​ కో అర్డినేటర్​ గంగాకిషన్​ తదితరులు  ఉన్నారు.

ఇంటింటికీ కేంద్ర పథకాలు

కామారెడ్డి , వెలుగు : ఇంటింటికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని  బీజేపీ కామారెడ్డి నియోజక వర్గ ఇన్​చార్జి కాటిపల్లి వెంకటరమణరెడ్డి  తెలిపారు.    పట్టణంలోని 40వ వార్డుకు చెందిన పలువురు యువకులు ఆదివారం బీజేపీలో చేరారు. వారికి  వెంకటరమణరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై  పార్టీలో చేరేందుకు   యువకులు ముందుకొస్తున్నారన్నారన్నారు. ఈ కార్యక్రమంలో  మున్సిపల్​ ఫ్లోర్​ లీడర్​ మోటూరి శ్రీకాంత్​,  బీజేవైఎం లీడర్​ నరేందర్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మున్నూరు కాపులు అన్నిరంగాల్లో రాణించాలి 

నిజామాబాద్,  వెలుగు:  మున్నూరు కాపులు  అన్నిరంగాల్లో రాణించాలని ,  ఔత్సాహికులను ప్రొత్సాహించాలని  ఆర్టీసీ చైర్మన్​  బాజిరెడ్డి గోవర్ధన్​,  తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్   చైర్​ పర్సన్​ ఆకుల లలిత పిలుపునిచ్చారు. మున్నూరు కాపు జిల్లా మహిళా విభాగం ఇందూరు  ఆధ్వర్యంలో ఆదివారం కార్తీకమాస వనభోజనాలు మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా    బాజిరెడ్డి గోవర్ధన్  పాల్గొన్నారు.  ఈసందర్భంగా    గోవర్ధన్​, ఆకుల లలిత మాట్లాడారు.  ఆర్థికంగా వెనుకబడిన   ప్రతిభావంతులైన విద్యార్థులకు  సంఘ పెద్దలు   ఆర్థిక చేయాతనివ్వాలని కోరారు.  ఈ కార్యక్రమంలో   ఉమ్మడి జిల్లా ఐడీసీఎంఎస్​  చైర్మన్  సంబారి మోహన్ ,  మాజీ మేయర్  ఆకుల సుజాత శ్రీశైలం  తదితరులు   పాల్గొన్నారు. 

లైఫ్​స్టైల్​లో మార్పుతో డయాబెటిస్​ నియంత్రణ

నిజామాబాద్,వెలుగు: డయాబెటిస్ తో బాధపడుతున్న వారు  ట్యాబెట్లు వాడితే కిడ్నీ, కండ్లు, బ్రెయిన్​ నరాలపై ప్రభావం పడుతుందన్నారు. అపోహ మాత్రమేనని   ఎండోక్రైనాలిజిస్ట్​ ధన్ పాల్ వినయ్​ కుమార్​ అన్నారు.  వరల్డ్​ డయాబెటిస్​ డే సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.  నిద్రలేమి,  మానసిక ఒత్తిడి, వ్యాయామం లేకపోవడంతో డయాబెటీస్​ పెరుగుతోందని చెప్పారు.  ముఖ్యంగా 40 ఏళ్లుపైబడిన వ్యక్తులు దీని బారిన పడుతున్నారని,   ఆహార అలవాట్లు,  నిత్యం వ్యాయామం చేస్తూ డయాబెటిస్​ ను నియంత్రివచ్చని చెప్పారు. డయాబెటిస్​ ఉన్న వారు  వెజ్​ ఆహారమే తీసుకోవాలని,  అల్కహాల్, స్మోకింగ్​ అలవాట్లను మానేయాలని అన్నారు.