కాపోల్లం 13 శాతం ఉంటే.. 5 శాతం అంటరా?

కాపోల్లం 13 శాతం ఉంటే.. 5 శాతం అంటరా?

జూబ్లీహిల్స్, వెలుగు: రాష్ట్రంలో మున్నూరు కాపులు 13 శాతం ఉంటే ప్రభుత్వం 5 శాతం మాత్రమే ఉన్నట్టు చూపించిందని మున్నూరుకాపు ఆత్మగౌరవ మహాధర్నా సేన మండిపడింది. మున్నూరుకాపుల హక్కుల సాధన కోసం బుధవారం ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్​ఉగ్గే శ్రీనివాస్​పటేల్​ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్​లోని సీఎం రేవంత్​రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించారు. స్థానిక పోలీసులు అడ్డుకుని ఎస్.ఆర్.నగర్, పంజాగుట్ట పోలీస్​స్టేషన్లకు తరలించారు. 

శ్రీనివాస్​పటేల్​మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సీఎం ఇంటి ముట్టడికి వస్తున్న మున్నూరు కాపులను అరెస్ట్​చేసి 72 పోలీస్​స్టేషన్లకు తరలించారన్నారు. మున్నూరు కాపుల కోసం ప్రభుత్వం ఫైనాన్స్​కార్పొరేషన్​ఏర్పాటు చేసి రూ.5 వేల కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్​చేశారు. మున్నూరు కాపులకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్​చేశారు. ఆయన వెంట రామిని సందీప్​,కటికం మహేష్​, అమరం శ్యాం, పత్తి అనిల్, మల్లేశ్​ఉన్నారు.