మునుగోడు ఉప ఎన్నిక భారతదేశ చరిత్రలో నిలిచిపోయే ఎన్నిక అని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబానికి, నాలుగు కోట్ల ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటంలో మునుగోడు ప్రజలు చరిత్రత్మక తీర్పు ఇవ్వాలని కోరారు. తాను బయపడి ఇంట్లో కూర్చోలే అని.. మునుగోడు అంటే ఈరోజు ప్రపంచం చర్చించుకునేలా చేశానని గర్వంగా చెప్పుకున్నారు. ఆనాడు ఉద్యమం చేసిన నాయకులు ఎటు పోయారన్న రాజ గోపాల్ రెడ్డి... ఇపుడు తెలంగాణ ద్రోహులు నీ పక్కన ఉన్నారని విమర్శించారు.
ఉద్యమంలో కేసీఆర్ కు కుడిబుజంగా ఉన్నది రాజేందర్ గారని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఉద్యమ ద్రోహులను పక్కన పెట్టుకుని రాజేందర్ ను అవమానించి బయటికి పంపించారని ఆరోపించారు. నీ వెనక నేనున్నా అని ఈటెల రాజేందరన్న మన దగ్గరికి వచ్చాడన్న ఆయన.. ఆ రోజు ధర్మానికి, అధర్మానికి... అహంకారానికి, ఆత్మ గౌరవానికి మధ్య పోరాటం జరుగుతుంటే రాజేందరన్నకు సపోర్ట్ గా ఉన్నానని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఏ ఎమ్మెల్యే కూడా కొట్లాడని విధంగా అసెంబ్లీలో మూడున్నరేండ్లు గా కొట్లాడానన్న రాజగోపాల్ రెడ్డి.. అయినా అభివృద్ధికి కనికరించలేదని ఆరోపించారు.