మునుగోడు బైపోల్: కూసుకుంట్లను నిలదీసిన యువకులు

మునుగోడులో పార్టీలు హోరాహోరీ ప్రచారం చేస్తున్నాయి. పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో గెలుపు కోసం అభ్యర్థులు తీవ్రంగా కష్టపడుతున్నారు. నువ్వా నేనా అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే పలుచోట్ల టీఆర్ఎస్ కు జనం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.  ఇవాళ నాంపల్లి మండలం టిపి గౌరారం గ్రామంలో  ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ప్రచారం చేస్తున్న కూసుకుంట్లను కొందరు యువకులు అడ్డుకుని నిరసన తెలిపారు. గతంలో గెలిచి కూడా గ్రామంలో అభివృద్ధి చేయలేదంటూ నిలదీశారు.  కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ యువకులు నిరసన తెలిపారు.  వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా  వినకపోవడంతో  కూసుకుంట్ల అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మునుగోడు ఉప ఎన్నికకు నవంబర్ 3న పోలింగ్ జరగనుంది. నవంబర్ 1 నుంచి ప్రచారానికి తెరపడుగుండటంతో పార్టీలు పోటాపోటీ సభలకు ప్రయత్నం చేస్తున్నాయి. అక్టోబర్ 29న భారీ బహిరంగ సభకు బీఎస్పీ ప్లాన్ చేస్తుండగా..30న టీఆర్ఎస్, 31న బీజేపీ సభ నిర్వహించాలని చూస్తోంది.