సీఎం రేవంత్ ని కలిసిన కాంగ్రెస్​ నేతలు

మునుగోడు, వెలుగు : పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పున్న కైలాస్ నేత   ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్​ నేతలు   శనివారం హైదరాబాద్​లో  సీఎం రేవంత్​ రెడ్డిని  కలిశారు.  నల్గొండ, భువనగిరి స్థానాల్లో కాంగ్రెస్​ గెలుపునకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. వారితో పాటు  నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

 భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి  ఉన్నారు.  కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయప్రకాష్ రాపోలు, మాజీ ఎంపీపీ చమాల శ్రీనివాస్, మేకల మల్లయ్య,బొల్లం వెంకన్న, కాటం వెంకన్న, దేవదాస్, మిర్యాల విజయ్, ప్రమోద్, కృష్ణయ్య, ఈడెం చంద్ర శేఖర్, సచిన్ పాల్గొన్నారు