చండూరు (నాంపల్లి), వెలుగు : దేవరకొండ ఎస్ హెచ్ఓ ఎస్ఐగా పనిచేస్తున్న మొగుళ్ల శోభన్ బాబు బదిలీపై మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లికి వచ్చారు. శనివారం నాంపల్లి పీఎస్‌లో ఎస్ఐ శోభన్‌బాబు బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఎస్ఐ లచ్చిరెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారు.